భగవద్గీత అంటే ఏమిటి?

జీవితమంతా అయిపోయిన తర్వత చదువుకోవాల్సిన పుస్తకమా? లేక 

రిటైర్మెంట్ రోజు సహోద్యోగులు ఇచ్చే బహుమతా?

ఎవరైనా చనిపోయినప్పుడు ప్లే చేసే సీడీ నా

అది కేవలం హిందువులదా?

పని పాట వదిలేసి సన్యాసించమని చెబుతుందా అది.?

Srimad, Bhagavad, Gita ,Chapters ,Sankya ,Yogam ,Shlokam, Ghantasala, Garu,
కాదు అవన్నీ అపోహాలు. ఒక్క ముక్కలో చెప్పాలంటే భగవద్గీత 'డైనమిక్ ప్రస్కిప్షన్ ఫర్ లైఫ్'

సంతృప్తి సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే,

చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే.

భగవద్గీతను చదువుతూ అర్థం చేసుకోవాలి 


ఉదాహరణకు కొన్ని చూద్దాం..

   భగవద్గీత హిందువులది కనుక నేను చదవను.

   నాకు దాని అవసరం లేదు అని చెప్పే వాళ్ళు    

   ఎలాంటి వాళ్ళు అంటే భూమి ఆకర్షణ సిద్ధాంతం 

   న్యూటన్ కనిపెట్టాడు అది బ్రిటిష్ వాళ్లది మనం

   దాని జోలికి పోవద్దు అనే వాళ్లతో సమానం

   భగవద్గీత భారతీయులందరిది.

2

సంతోషంగా ఉండాలి అని ఏవేవో చేస్తుంటటాం.

వాస్తవానికి కోరికల్ని అధిగమించినప్పుడు 

మీరు సంతోషంగా ఉంటారు ఉదాహరణకు

ప్రమోషన్ కావాలి కావాలి కావాలి అనుకుని నిరంతరం దాని గురించి ఆలోచించే వ్యక్తికి.


చింత తప్ప మరి ఏమి మిగలదు.

అదే తన పని తాను నిజాయితీగా సమర్థంగా చేసుకుపోయే వ్యక్తికి ఆలోచించనవసరం లేకుండా

ప్రమోషన్ వస్తుంది. భగవద్గీత చెప్పేది కూడా అదే

నీ పని నువ్వు చేయ్యి ఫలితం గురించి ఆలోచించకు అని..

3

 సన్యాసం అనేది  కాషాయందుస్తులతో రాదు.

అదొక మానసిక స్థితి, వందమంది మధ్యన ఉన్న,

వంద పనులున్నా కూడా తామరాకు మీద నీటిబొట్టుల ఉండటమే సన్యాసం అంటే..

4

ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవలి అంటే 

దానర్థం అన్నిటినీ వదిలేసి మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం కనేకాదు.

ప్రపంచం అందిస్తున్న అన్నిటిని  ఇంద్రియాల సహాయంతో తెలివిగా వాడుకోమని.

అలా వాడుకుంటే ప్రశాంతత, ద్వారా విజయం లభిస్తాయి. ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది.


5

ఒక క్రీడాకారుడుకి  అతని సామర్థ్యం ఫిట్నెస్ ఒకేలా ఉన్నప్పటికీ ఒక్కరోజే విజయం సాధిస్తాడు మరుసటి రోజు చిత్తుచిత్తుగా ఓడిపోతాడు

ఆ మరునాడు మామూలు ఆట తీరును.

ప్రదర్శిస్తాడు


 ఎందుకలా మైండ్ ప్రశాంతంగా ఉంటే

ఉత్సాహంగా ఉంటే దేనినైనా సాధించవచ్చు ప్రశాంతతను సాధించడం ఎలాగో భగవద్గీత చెబుతుంది కేవలం నీకోసమే అని మీరు చేసే 

పనుల్లో  రాణించలేకపోవచ్చు. 


నేనే అనే దాన్ని అధిగమిస్తే మీకు కొత్త శక్తి వస్తుంది ఉదాహరణకు కేవలం నా ఆనందం కోసం మాత్రమే ఆడుతున్న అనుకునే క్రీడాకారుడి భవిష్యత్తు వాడితోనే ఆగిపోతుంది అదే దేశం కోసం ఆడాలి అనుకుంటే అతనిలో కొత్త ఉత్సాహం వస్తుంది.


ఏకాగ్రతతో ఆడుతాడు అతడ్ని విజయం వరిస్తుంది

నాకోసం కాదు అనుకోని చూడండి ఏ పనిలోనైనా మీకు బాధ్యత పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది

భగవద్గీత చెప్పేది అది.


🕉️ అసలు భగవద్గీత ఏం చెప్తుంది  చూద్దాం 🕉️


👉ధర్మ ధర్మాల గురించి చెబుతుంది. 

👉 కర్తవ్యాల గురించి చెబుతుంది.

👉 నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు.

👉కోరికల్ని అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.

👉 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.

👉 సుఖం,శాంతి ,త్యాగం ,యోగం, అంటే ఏమీటో చెబుతుంది.


👉 ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.

పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.

 👉ఆత్మ తత్త్వం నిరూపణ చేస్తుంది. స్వకల్యాణం 

కోసం కాక కళ్యాణం కోసం జీవించమని చెబుతుంది.

👉జ్ఞానం, మోక్షం, బ్రహ్మం ఆధ్యాత్మం, అంటే ఏమిటో చెబుతుంది

👉 ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో  చెబుతుంది.


👉ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.

👉 మంచి పనులు చేసే వాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.

👉 పరమాత్ముడికి ఎవడు ఇష్ణుడో చెబుతుంది.

ఆయనను చేరే మార్గాన్ని చూపిస్తుంది.


👉 కర్మ, భక్తీ, జ్ఞానమార్గాల ద్వారా వేలు పట్టుకొని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.

👉 నీలానే ఇతర ప్రాణికోటిని ప్రేమించమని చెబుతుంది.

👉అనారోగ్యకరమైన భావోద్యోగాలను నియంత్రిస్తుంది.


అందుకే భాగవతం సర్వ మానవాళి కోసం.

అర్థం చేసుకున్నవారు ధన్యులు. నిన్ను నన్ను మన అందర్నీ గురించి మాట్లాడుతుంది భగవద్గీత. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది. అందుకే


🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️


గీత  చదువుకో………

నీ రాత మార్చుకో…...

🕉️ 🙏🌹


Srimad, Bhagavad, Gita ,Chapters ,Sankya ,Yogam ,Shlokam, Ghantasala, Garu