Bruce Lee Quotes in telugu images with text inspirational quotes telugu
బ్రూస్ లీ 27 తెలుగు కోట్స్ ( బ్రూస్ లీ సూక్తులు)
మార్షల్ ఆర్ట్స్ ధీరుడు బ్రూస్ లీ గారి కొటేషన్స్ తెలుగులో, బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు. బ్రూస్ లీ ఎత్తు 5 అడుగుల
6 అంగుళాలు ఎంతటి బలవంతుడినైనా సరే ఒక్క దెబ్బతో మట్టికరిపించగల దీరుడు. కుంఫు, కరాటే, నేర్చుకునే వారికి ఆరాధ్య దైవం బ్రూస్ లీ. బ్రూస్ లీ సినిమా పరిశ్రమలో హీరోగా చాలా చిత్రాల్లో నటించాడు. షూటింగ్లో బ్రూస్ లీ పంచ్ కెమెరాకి కూడా దొరకనంత వేగంగా ఉండేవి.
Bruce Lee Quotes in Telugu image's text
Bruce lee quotes telugu text
10,000 కిక్లను ఒకసారి ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి నేను భయపడను, కానీ ఒక కిక్ ని 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిసిన వ్యక్తికి నేను భయపడతా.!
-బ్రూస్ లీ
ఒక మనిషి ఎంత నిజాయితీ పరుడో అతని
ఆనందాన్ని బట్టి అంచనా వేయవచ్చు.
-బ్రూస్ లీ
సూత్రాలకు కట్టుబడి ఉండకుండా, వాటిని
పాటించండి
-బ్రూస్ లీ
దేనిగురించైతే నీవు ఆలోచిస్తావొ. దానినే సాధిస్తావు.
బ్రూస్ లీ
ముందు నీ లక్షన్ని నిర్ణయించుకొ, తర్వాత దాన్ని
సాధించడం కోసం కృషి చెయ్యి.
-బ్రూస్ లీ
జ్ఞానం మీకు శాక్తిని ఇస్తుంది, కానీ వ్యక్తిత్వం
గౌరవాన్ని ఇస్తుంది.
-బ్రూస్ లీ
విజయం అంతిమ లక్ష్యమూ కాదు, ఓటమి
శాశ్వతమూ కాదు, అన్ని పరిస్థితుల్లోనూ
ఆత్మవిశ్వాసంతో ఉండగలగడమే మన గొప్పతనం.
-బ్రూస్ లీ
ఓటమి అనేది ఒక ఆలోచన, వాస్తవంగా
అంగీకరించనంతవరకు ఓటమి ఎవరిని
ఒడించలేదు.
-బ్రూస్ లీ
అనవసరపు ఆలోచనలను బుర్రలో నుండి ఖాళీ
చేయించు, ఒక రూపు, ఆకారం లేకుండా ఉండు.
నీరులా .
-బ్రూస్ లీ
ఒక పనికి సంబంధించి ఎక్కువ సమయాన్ని
ఆలోచించటానికే వెచ్చిస్తుంటే, నీవు దానిని ఎప్పటికీ
పూర్తి చేయలేవు.
-బ్రూస్ లీ
స్వాదీనం అనేది ఏదైనా, మనస్సులోనే మొదలువుతుంది.
-బ్రూస్ లీ
పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ, నేను
అవకాశాలను సృష్టించుకుంటాను.
-బ్రూస్ లీ
గెలవగలనని నమ్మకం లేనివాడు, మానసికంగా
ఆటకు ముందే ఓడిపోతాడు.
-బ్రూస్ లీ
జీవితం దాని గమనంలో మనకు నిరంతరం పాఠాలు
నర్పుతూనే ఉంటుంది.
-బ్రూస్ లీ
విజేత అయిన ప్రతి వ్యక్తి వెనకా కష్టం ఉంటుంది,
కష్టం విజయంతోనే ముగుస్తుంది.
-బ్రూస్ లీ
మన జీవితమే మనకు ఉపాధ్యాయుడు, అది
నిరంతరం మనకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
-బ్రూస్ లీ
విజయం సాధించాలనే మీ సంకల్పమే
అన్నింటికన్నా ముఖ్యం, అనుక్షణం దీన్ని గుర్తు
చేసుకోవడమే విజయ రహస్యం.
-బ్రూస్ లీ
విజయం ప్రయానమేగానీ, గమ్యం కాదు.
-బ్రూస్ లీ
ఆటంకాలేదురయ్యే కొద్దీ, మనం మరింతదృఢంగా ఆ పనిని పూర్తి చేయ్యాలనేపట్టుదలను పొందాలి.
-బ్రూస్ లీ
నీ జీవితమే నీకు గురువు ఎందుకుంటే, అది నీకు నిరంతరం పాఠాలు నేర్పుతూనే ఉంటుంది.
-బ్రూస్ లీ
ఇతరులపై గెలిచినవాడు బలవంతుడు.తనను
తాను గెలిచిన వాడు శక్తిమంతుడు.
-బ్రూస్ లీ
సాఫీగా సాగిపోయే జీవితం కోసం ప్రార్ధించకు.
కష్టాల్ని తట్టుకుని నిలబడే బలం కోసం ప్రార్థించు.
-బ్రూస్ లీ
ఒప్పుకునే దైర్యముంటే, తప్పులుఎప్పుడూ క్షమించదగినవే.
-బ్రూస్ లీ
పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండనీ.మనం
అవకాశాలను సృష్టించుకోవలి.
-బ్రూస్ లీ
ఆశయం లేని జీవితం దీపం లేని ఇల్లు వంటిది.
-బ్రూస్ లీ
పరిస్థితుల్ని చూసి పారిపొకూడదు, ఎదురు
నిలబడినప్పుడు, సమస్య ఏదైనా చిన్నబోతుంది.
-బ్రూస్ లీ
నీవు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే, సమయాన్ని వృథా చేయొద్దు. ఎందుకంటే, జీవితాన్ని నర్దేశించేది
సమయమే.
-బ్రూస్ లీ
బ్రూస్ లీ గురించి తెలుగులో తెలుసుకోండి
బ్రూస్ లీ 1940 నవంబర్ 27వ తేదీన అమెరికా లోని శాన్ ఫ్రాన్సిస్కో లో జన్మించాడు. బ్రూస్ లీ పుట్టిన కొంతకాలం తర్వాత ఆయన కుటుంబం అమెరికా నుండి హాంకాంగ్ కి వచ్చేశారు. బ్రూస్ లీ నాన్నగారు సినిమాల్లో నటించేవారు ఆయన బ్రూస్ లీ ని కూడా అప్పుడప్పుడు సినిమా షూటింగ్ కి తీసుకెళ్లేవారు. దాంతో బ్రూస్ లీ చిన్న వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం దక్కింది. అలా బ్రూస్ లీ నటనతో పాటు బ్రూస్ లీ డాన్స్ కూడా నేర్చుకున్నాడు.
అమెరికాలో హాంకంగ్ మాఫియా గ్యాంగ్ లు ఎక్కువ మాఫియా లే పాలించేవి. అక్కడ బ్రతకడం చాలా కష్టంగా ఉండేది. అప్పుడు బ్రూస్లీకి 14 ఏళ్ళు ఒకసారి స్కూల్ నుండి ఇంటికి వస్తుండగా ఒక గ్యాంగ్ బ్రూస్ లీ తో గొడవపడ్డారు ఆ గొడవలో బ్రూస్ లీ ని గట్టిగా కొట్టారు. ఆ గొడవ తోనే బ్రూస్ లీ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి ముఖ్య కారణం.అప్పటి రోజుల్లో తనను తాను రక్షించుకోవడం కోసం బ్రూస్ లీ మార్షల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఆ రోజుల్లో కుంఫు లో నెంబర్ వన్ గా ఉన్న ఇఫ్ మన్ అనే కుంగ్ ఫు మాస్టర్ దగ్గర నేర్చుకున్నాడు, మరోసారి ఒక రోజు స్కూల్లో ఆ గ్యాంగ్ దాడికి వచ్చారు. బ్రూస్ లీ ఇప్పుడు మునుపటిలా లేడు. చాలా శక్తివంతంగా దృఢంగా ఉన్నాడు చాలా బలంగా వాళ్ల మీదకి బ్రూస్ లీ దాడికి దిగాడు
ఒకరి చెయ్యి, విరిగిపోయేలా మరొకరి పళ్ళు ఊడిపోయేలా, చిత్తుచిత్తుగా చితక్కొట్టాడు. ఇలా కొట్టినందుకు బ్రూస్ లీ నీ పోలీష్ లు ఇంకోసారి గొడవకు వెళితే బ్రూస్ లీ ని జైల్లో
వెస్తం అని తండ్రికి హెచ్చరికగా చెప్పారు.
ఈ మాఫియా గొడవలన్నీటికి దూరంగా మాఫియా గ్యాంగ్ నుంచి బ్రూస్ లీ నీ దూరంగా పంపించాలనీ బ్రూస్ లీ తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు 18 ఏళ్ల లో బ్రూస్ లీ నీ కాలిఫోర్నియాలో తన స్నేహితుడు ఇంటికి పంపారు. మళ్లీ పుట్టిన చోటుకి వచ్చేశాడు బ్రూస్ లీ. ఒక రెస్టారెంట్లో వెయిటర్ గా పనిచేశాడు, బ్రూస్ లీ కొంతకాలం తర్వాత యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లోని ఫిలాసఫీ కోర్స్ లో జాయిన్ అయ్యాడు. చదువుతో పాటు అక్కడ మార్షల్ ఆర్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసేవాడు బ్రూస్ లీ.
మార్షల్ ఆర్ట్స్ కారణంగా కాలేజీలో బ్రూస్ లీ క్రేజ్ పెరగడం మొదలయింది, బ్రూస్ లీ స్నేహితులంతా బ్రూస్ లీ దగ్గర
కరాటే నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవారు, చదువుకుంటూనే అలా స్నేహితుల కోరిక మేరకు 1963లో 'jun fan Gung fu' అనే పేరుతో మార్షల్ ఆర్ట్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాడు. బ్రూస్ లీ తన కాలేజ్ లో తన స్నేహితురాలు 'లిండా లీ క్యడ్ వెల్' ను ప్రేమించి 1964లో తనను పెళ్లి చేసుకున్నాడు………
0 Comments
Feel free to feedback 😊